2030 నాటికి చంద్రుడిపైకి తమ వ్యోమగాములను పంపాలనే లక్ష్యంలో ఉన్న చైనా ఓ అధునాతన స్పేస్‌సూట్‌ను డిజైన్ చేసింది. ఈ స్పేస్‌సూట్ చంద్రునిపై కనిపించే విపరీతమైన ఉష్ణోగ్రతలు, రేడియేషన్, ధూళిని తట్టుకునేలా రూపొందించబడింది. ముఖ్య లక్షణాలలో ఇంటిగ్రేటెడ్ కెమెరాలు, ఆపరేషన్స్ కన్సోల్, గ్లేర్- రెసిస్టెంట్ వైజర్ ఉన్నాయి. ఇవన్నీ వ్యోమగాములకు వారి ఎక్స్‌ట్రా వెహికల్ యాక్టివిటీస్‌లో సహాయపడతాయి.