జీవిత, ఆరోగ్య బీమాపై పూర్తిగా జీఎస్టీ తొలగించడానికి జీఎస్టీ కౌన్సిల్ సంసిద్ధంగా లేదు. ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించే జీఎస్టీ కౌన్సిల్ యోచన చేస్తుంది. జీవిత బీమా పాలసీలకు పూర్తిగా జీఎస్టీని మినహాయించాలని సిఫారసు చేస్తూ డిసెంబర్‌లో మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్ ముందు నివేదికను ఉంచింది.