విశాఖ వేదికగా నేడు ఐపీఎల్ క్రికెట్ యుద్ధం జరగనుంది. ఎప్పుడు స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూసేద్దామా అని ఎదురు చూసే క్రికెట్ అభిమానులు ఈరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖ స్టేడియంకు వెళ్లి చూడవచ్చు. దిల్లీ క్యాపిటల్స్-లఖ్‌నవూ జట్లు తలపడనుండగా.. ఈ క్రికెట్ ని వీక్షించేందుకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. ఈ మేరకు స్టేడియం వద్ద 1700 మంది పోలీసులతో నిఘా పెట్టారు.