షావోమీ అనుబంధ సంస్థ పొకో ఎం సిరీస్‌లో ఎం7 5జీని లాంచ్ చేసింది. 50 ఎంపీ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.10 వేలలోపే తీసుకురావడం విశేషం. ఈ ఫోన్‌లో 6.88 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లే ఇచ్చారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,999, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999గా పేర్కొంది.