యూఏఈలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందిరికి తెలిసిందే. చిన్న చిన్న తప్పులకే మరణశిక్ష విధించడం మనం చూసుంటాం. తాజాగా ఓ భారతీయ మహిళకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. యూపీలోని బాందా జిల్లాకు చెందిన మహిళ యూఏఈలో ఉంటుంది. ఇటీవల ఆమె ఓ చిన్నారి మరణానికి కారణమవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా ఆమెపై చేసిన ఆరోపణలు నిజమని తేలడతో అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.