AP: గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆలస్యమవుతుందని మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష అనంతరం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'గత ప్రభుత్వం చేసిన బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నాం. ప్రతి నెల రూ. 4 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఇచ్చిన 6 గ్యారంటీల్లో రెండింటిని అమలు చేశాం. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి మాట నిలబెట్టుకుంటాం' అని అన్నారు.