దేశవ్యాప్తంగా ESIC ఆసుపత్రుల్లో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. UPSC నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023లో పాస్ అయిన వారు అర్హులు. ఎంబీబీఎస్ పాస్ అవడంతో పాటు రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు లాస్ట్ డేట్ 31-01-2025. పూర్తి వివరాలకు www.esic.gov.in/recruitments వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.