కారు రేసులో దూసుకెళ్లిన కారు.. 7 మంది మృతి (వీడియో)

1560చూసినవారు
శ్రీలంకలోని ఫాక్స్ హిల్ సూపర్ కార్ రేస్ ఈవెంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో కనీసం 7 మంది మరణించారు. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి 8 ఏళ్లు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో కొందరు ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్