ఒకే బంతికి 7 పరుగులు.. ఫోర్, సిక్స్ కాదు (వీడియో)

80చూసినవారు
అండర్-19 ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే బంతికి బ్యాటర్లు ఏడు పరుగులు తీశారు. అయితే, అది ఫోర్, సిక్స్ మాత్రం కాదు. ఇంగ్లండ్ ఆటగాడు ఆర్యన్ సావంత్ బంతిని కొట్టగా అది బౌండరీ వైపు వెళ్లింది. ఈ లోపు బ్యాటర్లు పరుగులు తీయడం మొదలు పెట్టారు. ఫీల్డర్ విసిరిన బంతిని కీపర్ వదిలిపెట్టడంతో బ్యాటర్లు తమ పరుగును కొనసాగించారు. ఇలా మొత్తం 7 పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్