TG: ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. కట్టెలమండి ప్రాంతంలో తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణ (32)ను మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్ గౌడ్ (25), ఉదయ్ కిరణ్ (22)లు తమ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని కృష్ణను చితకబాదారు. ఈ మేరకు కృష్ణ లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కోర్టు 6 రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.