AP: సత్యసాయి జిల్లా అంగళి మండలంలోని రామనపల్లి గ్రామ సమీపంలో విద్యుత్ షాక్‌తో లైన్ మెన్ శివకుమార్ (48) మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభం ఎక్కి ప్యూజ్ అమర్చే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై లైన్ మెన్ శివ కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు.