తెలంగాణలో మొత్తం 8 మంది IASలను బదిలీ చేస్తూ CS శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సహకార శాఖ కమిషనర్, మార్కెటింగ్ డైరక్టర్‌గా కె.సురేంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు, ఆర్.వి.కర్ణన్‌కు ఆరోగ్యశ్రీ సీఈవోగా, శివశంకర్ జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖ డైరక్టర్‌గా కె.హరిత, సీడ్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఎండీగా యాస్మిన్ బాషా, తెలంగాణ ఫుడ్స్ ఎండీగా కె.చంద్రశేఖర్ రెడ్డి, నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా సంచిత్ గాంగ్వార్‌ను నియమించారు. చేనేత జౌళి శాఖకు బి.శ్రీనివాస రెడ్డిని బదిలీ చేశారు.