అన్ని కాలాల్లో సాగుకు అనువైన పంట టమోటా. అధిక ఉష్ణోగ్రతకు, ఎక్కువ వర్షపాతానికి ఇది తట్టుకోలేదు. టమోటాను నారుకుళ్లు తెగులు ఆశిస్తే విత్తటానికి ముందు తప్పనిసరిగా 3గ్రా మాంకోజెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆకు మాడు తెగులు నివారణకు 3గ్రా కాస్టాన్ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేయాలి. స్పాటెడ్ విల్డ్ వైరస్ నివారణకు ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ 3జి గుళికలు వేయాలి.