మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఒకరు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. కట్టెలు కొట్టేందుకు ఐదుగురు వ్యక్తులు అడవికి వెళ్లారు. ఆ సమయంలో ప్రెజర్ బాంబు పేలి ఏసు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.