TG: ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘గర్ల్‌ప్రైడ్’ పేరిట జిల్లాలో ఆడపిల్ల పుట్టిన ఇంటికి జిల్లా అధికారులు వెళ్లి మిఠాయి బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలని ఆదేశించారు. అమ్మాయి పుట్టడం శుభ సూచకమని ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. వచ్చే వారం నుంచి పర్యటనలు ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు.