2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ ప్రకటించారు. భారత సంతతికి చెందిన ఈమె గతంలో కరోలినా గవర్నర్ గా, ఐక్యరాజ్య సమతిలో అమెరికా రాయబారిగా సేవలు అందించారు. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఈమె రేసులో నిలవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.