థియేటర్ లో ఫ్లాప్ సినిమా టీవీలో సూపర్ హిట్.!

2260చూసినవారు
థియేటర్ లో ఫ్లాప్ సినిమా టీవీలో సూపర్ హిట్.!
మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లలో బోల్తా కొట్టింది. విడుదలైన రెండో రోజుకే దుకాణం సర్దేసింది. ఇలాంటి సినిమా తాజాగా బుల్లితెరపై దుమ్ము దులపడం విశేషం. స్టార్ మా ఛానెల్ లో 'ఆదికేశవ' సినిమాను ప్రసారం చేశారు. ఈ సినిమాకు ఏకంగా రికార్డు స్థాయిలో 10.29 (అర్బన్) TRP వచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రభాస్, చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి టాప్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయిలో రేటింగ్ రాలేదు.

సంబంధిత పోస్ట్