తొలి టెస్టులో ఘోర పరాభవం మూటగట్టుకున్న టీమిండియా రెండో మ్యాచ్ కోసం జట్టులో కీలక మార్పు చేసింది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ఆడుతున్న సుందర్ త్వరలోనే జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ఆదివారం సాయంత్రం వెల్లడించింది. చివరి రెండు టెస్టులకు భారత్ 16 మంది బృందంతో కొనసాగనుందని బోర్డు స్పష్టం చేసింది.