రామోజీరావుకు నివాళిగా సినీ ఇండస్ట్రీ కీలక నిర్ణయం

75చూసినవారు
రామోజీరావుకు నివాళిగా సినీ ఇండస్ట్రీ కీలక నిర్ణయం
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ క్రమంలో ఆయనకు నివాళిగా తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావుకు సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు. కాగా, అనారోగ్యం కారణంగా ఇవాళ తెల్లవారుజామున రామోజీరావు (88) కన్నుమూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్