రేవ్ పార్టీలో ఇద్దరు నటులు.. బెంగళూరు సీపీ క్లారిటీ

5115చూసినవారు
రేవ్ పార్టీలో ఇద్దరు నటులు.. బెంగళూరు సీపీ క్లారిటీ
బెంగళూరు రేవ్ పార్టీ కేసును ఎప్పుగూడ పీఎస్ కు బదిలీ చేసినట్లు బెంగళూరు సిటీ కమిషనర్ వెల్లడించారు. రేవ్ పార్టీలో ఇద్దరు నటులు ఉన్నారని, వారి నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించినట్లు తెలిపారు. అయితే ఈ పార్టీలో ప్రజాప్రతినిధులు వచ్చినట్లు సమాచారం లేదన్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్ కొనుగోలుపై కొత్త చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా ఈ కేసులో దాదాపు 150 మందిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్