ఇండ్లల్లో ఉన్నవారు దుకాణం ఓపెన్ చేశారు: ఈటల

58చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP MP ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ వస్తామో రామో.. దొరుకుతాదో దొరకదో అన్న పద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. 'బిల్లులు విడుదల చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 7-10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బైటకి రావడం లేదు. ఇండ్లల్లో ఉన్నవారు కూడా దుకాణం ఓపెన్ చేశారు. నేను కూడా ఐదేండ్లు ఫైనాన్స్ మినిస్టర్‌గా చేశాను. ఎప్పుడైనా ఇలా విన్నారా?' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్