బావతో కలిసి పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. తర్వాత ఏమైందంటే

60చూసినవారు
బావతో కలిసి పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. తర్వాత ఏమైందంటే
యూపీలోని బిజ్నోర్‌లో విషాదం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. రాఖీ అనే మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వరుసకు బావ అయిన డేవిడ్ అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వీరు నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ డేవిడ్, రాఖీలు చనిపోదామని నిర్ణయించుకున్నారు. జూన్ 19న నజీబాబాద్ లోని గర్మల్ పూర్ ఫ్లైఓవర్ సమీపంలో పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్