కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు.. వీడియో వైరల్

78చూసినవారు
కారుకు పెట్రోల్‌ కొట్టించుకున్న ఓ పోలీసు అధికారి.. ఆ తర్వాత అక్కడి ఉద్యోగిపైకి దూసుకెళ్లారు. కేరళ పోలీసు శాఖలో పనిచేస్తున్న కె.సంతోష్‌ కుమార్‌ ఆదివారం కన్నూర్‌లో తన కారుకు పెట్రోల్‌ కొట్టించుకున్నాడు. తర్వాత డబ్బు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్తుండగా.. అనిల్‌ అనే పెట్రోల్‌ పంప్ ఉద్యోగి కారును అడ్డుకున్నాడు. దీంతో అతడిపైకి కారుతో దూసుకెళ్లాడు. సీసీటీవీల్లో ఈ దృశ్యాలు రికార్డవ్వగా, వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్