ఈ ఏడాది దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ భావిస్తోంది. తిరోగమనంలో నైరుతి రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉందని, దీనివల్ల ఈ నెలలో ‘లా నినా’ ఏర్పడే పరిస్థితులున్నాయని తెలిపింది. వాయువ్య, మధ్య భారతదేశంలో విపరీతమైన చలిగాలులు వీస్తాయంది. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయినప్పుడు లా నినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3-5 డిగ్రీలు ఉండొచ్చు.