80 వేల ఏళ్ల తరువాత మళ్లీ దర్శనమిచ్చిన అరుదైన తోకచుక్క (వీడియో)

52చూసినవారు
ఓ అరుదైన తోకచుక్క దాదాపు 80 వేల ఏళ్ల తరువాత మళ్లీ భూమిపై నుంచి దర్శనమిస్తోంది. కామెట్ C/ 2023 A3 (Tsuchinshan-ATLAS) ప్రస్తుతం తెల్లవారుజామున ఆకాశంలో మనకు కనిపిస్తుంది. ఇది Sep 28, 2024న సూర్యునికి (పెరిహెలియన్) అత్యంత సమీపానికి చేరుకుంది. ప్రస్తుతం దూరంగా జరుగుతూ భూమిపై నుంచి స్పష్టంగా దర్శనమిస్తోంది. తూర్పు వైపున హారిజోన్ దిగువన మసకతోకతో అస్పష్టమైన నక్షత్రంలా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్