ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యంగ్ టైగర్ జూ.
ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం లభించింది.
ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో యంగ్ టైగర్ కు చోటు దక్కింది. మొత్తం ఐదుగురు యాక్టర్లను తమ యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ యాక్టర్ల లిస్టులో
ఎన్టీఆర్ తో పాటు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ ఉన్నట్లు తెలిపింది.