పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు షాక్ తగిలింది. డిఫెండర్ అమిత్ రొహిదాస్ ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురైయ్యాడు. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అమిత్ హాకీ ఫెడరేషన్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘించాడని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH) పేర్కొంది. ఈ మేరకు అమిత్‌ను ఒక మ్యాచ్ సస్పెండ్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అతడు ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.