మహారాష్టలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పూణెలోని పింప్రి చించ్‌వాడ్‌లో కుదల్‌వాడిలోని స్క్రాప్ గోడౌన్‌లో అకస్మాత్తుగా సోమవారం భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఎనిమిది ఇంజన్‌లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.