మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తన ఇద్దరు సవతి కొడుకులపై దాడి చేసినందుకు ఓ మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 7, 8 ఏళ్ల బాధిత మైనర్ బాలురు తండ్రి, సవతి తల్లితో కలిసి నివసిస్తున్నారు. వీరిలో పెద్ద అబ్బాయిని ఫోర్క్‌తో పొడిచిందని, చిన్న అబ్బాయి ప్రైవేట్ భాగాలపై వాతలు పెట్టడంతో పాటు చపాతీ కర్రతో కొట్టిందని ఆ మహిళపై ఆరోపణలు ఉన్నాయి.