తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం

68చూసినవారు
తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫానుగా బలపడింది. దీనికి ‘రెమాల్‌’గా నామకరణం చేశారు. క్రమంగా ఉత్తరదిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తుఫాను నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్‌ దీవుల ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది.

సంబంధిత పోస్ట్