విద్యుత్‌ స్తంభం విరిగిపడి మూడేళ్ల చిన్నారికి గాయాలు

591చూసినవారు
విద్యుత్‌ స్తంభం విరిగిపడి మూడేళ్ల చిన్నారికి గాయాలు
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన మెండ్ల శ్రీను–లక్ష్మి దంపతుల కుమార్తె చైత్ర(3)పై విద్యుత్‌ స్తంభం విరిగిపడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ఉండే గంగాధర్ అనే వ్యక్తి విద్యుత్ తీగలకు చెట్టుకొమ్మలు తగులుతున్నాయని.. ఆ చెట్టుకొమ్మలను నరికేశాడు. ఈ క్రమంలో ఆ చెట్టుకొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో.. వాటి బరువుకు స్థంభం విరిగి ఇంటిముందు ఆడుకుంటున్న చైత్ర కాలుపై పడింది. దీంతో చైత్రకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్