సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ కృష్ణవంశీ కాంబోలో తెరకెక్కిన 'మురారి' మూవీ ఆగస్టు 9న రీరిలీజైన సంగతి తెలిసిందే. అయితే మురారి ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో ప్రేమికులు పెళ్లి చేసుకోగా, వైరల్‌గా మారింది. దీనిపై కృష్ణవంశీ ఘాటుగా స్పందించారు. ‘ఇది చాలా చెత్త నిర్ణయం. మన సంస్కృతి, సంప్రదాయాలను అవమానించడమే. దయచేసి ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.