ఐఆర్‌ఎస్‌ అధికారి ఫ్లాట్‌లో మహిళ మృతదేహం కలకలం

76చూసినవారు
ఐఆర్‌ఎస్‌ అధికారి ఫ్లాట్‌లో మహిళ మృతదేహం కలకలం
నోయిడాలో ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి ఫ్లాట్‌లో మహిళా మృతదేహం కలకలం రేపింది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్ అధికారి సౌరభ్ మీనాకు, బీహెచ్‌ఈఎల్‌లో హెచ్‌ఆర్‌ అధికారిని శిల్పా గౌతమ్‌కు డేటింగ్‌ యాప్‌లో పరిచయమైంది. అయితే అతడి ఫ్లాట్‌లో సీలింగ్‌కు శిల్పా మృతదేహం వేలాడటాన్ని పోలీసులు గుర్తించారు. సౌరభ్.. పెళ్లి దాటవేస్తూ తన కుమార్తెను మోసగించడంతోపాటు హత్య చేశాడని ఆ మహిళ తండ్రి ఆరోపించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు సౌరభ్‌ను అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్