సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు రహదారిపై అత్యంత ప్రమాదకరంగా బైక్ నడుపుతూ కనిపించాడు. రోడ్డుపై వెళుతుండగా బైక్ వెనుక టైర్ ఊడిపోయేలా ఏర్పాటు చేసి.. ముందు టైర్ పై బైక్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా దూరం ప్రయాణించాడు. ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగిన అతడి ప్రాణాలు పోయేవని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.