Kia ఇండియా సరికొత్త హంగులతో కూడిన EV6 ఆధునిక వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.65.9 లక్షలు. 27 అత్యాధునిక భద్రత, 5 కొత్త అటానమస్ ఫీచర్లతో మరింత ఆధునీకరించిన అడాస్ 2.O ప్యాకేజ్‌తో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. పూర్తి చార్జింగ్‌తో 663 కి.మీ వరకు ప్రయాణించగలిగేందుకు 84 కిలోవాట్ బ్యాటరీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.