గ్రామీణ ప్రాంతాల్లో 'ఇంటి వద్దే డయాగ్నస్టిక్ స్కానింగ్ సేవలు' అందించాలనే చిన్న ఆలోచనతో తెలంగాణ హనుమకొండ జిల్లా భీంపల్లి గ్రామానికి చెందిన ఆకినపల్లి అఖిల స్టార్టప్ పెట్టింది. బీటెక్ చదువుతూనే తన స్నేహితులతో కలిసి 'సోనిక్ ఏ స్క్వేర్ బీ సొల్యూషన్స్' పేరుతో మొబైల్ క్లినిక్ సంస్థను స్థాపించింది. ఇందుకు గానూ బ్యాంకాక్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్-2024లో అఖిలకు టైటానియం, గ్రాండ్ అవార్డులు దక్కాయి.