ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

77చూసినవారు
ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఏడాదిగా ఆరోగ్యశ్రీ, EHS, JHS కింద రూ. 1000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. దీంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితులు లేవని వెల్లడించాయి. కాగా ఏడాదిలో రూ.920 కోట్ల బిల్లులు చెల్లించామని, మరో రూ.450-500 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్