మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. 'గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ తెచ్చింది. దాని ప్రకారం ఇళ్లు కులిస్తే ఆ ఇంటి విలువకు మూడింతలు ఎక్కువ నష్ట పరిహారం కట్టించాలి. ఆ ఇంట్లో 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వారి జీవనోపాధి కోసం 5 లక్షలు ఇవ్వాలి. వాళ్లకి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి' అని ఆయన పేర్కొన్నారు.