తెలంగాణలోని ఖమ్మంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రావణి అనే యువతిపై గణేష్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యువకుడు తనను ప్రేమించమని వెంటపడినా యువతి ఒప్పుకోకపోవడంతో జనవరి 13న సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా యాసిడ్‌తో దాడి చేశాడు. అయితే శ్రావణి తప్పించుకొని ఇంట్లోకి పరిగెత్తగా గణేష్ పరారయ్యడు. స్వల్పగాయాలతో బయటపడిన యువతి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.