అభిమాని హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తుగుదీపను అధికారులు బళ్లారి జైలుకు తరలించారు. కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని గార్డెన్లో సిగరెట్ కాలుస్తూ విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో వైరల్ కావడంతో ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ చేసి ఏడుగురు అధికారులను సస్పెండ్ చేశారు. దర్శన్‌కు జైలులో రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఫోటో తీవ్ర వివాదం రేపింది.