AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. కృష్ణా జిల్లా గన్నవరం టీటీడీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అరెస్టై, రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో వల్లభనేని వంశీ తనకు బెయిల్ మంజూరు చేయాలనీ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.