బూడిద గుమ్మడికాయతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా వాటర్ కంటెంట్ ఉంటుందని, అందువల్ల శరీరానికి కావాల్సిన నీరు అందుతుందన్నారు. ఇక ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు తక్షణమే శక్తిని అందిస్తాయని పేర్కొంటున్నారు. వేసవి కాలంలో దీని జ్యూస్ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ముఖ్యంగా డిప్రెషన్, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి ఇది మంచి ఔషధం.