పోలీసుల అదుపులో నటి హేమ

16078చూసినవారు
పోలీసుల అదుపులో నటి హేమ
బెంగ‌ళూరు రేవ్ పార్టీ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. డ్రగ్స్ టెస్టులో ఆమెకు పాజిటివ్ రాగా, విచారణకు రావాలని కొన్ని రోజుల క్రితం పోలీసులు స‌మ‌న్లు ఇచ్చారు. అయితే హేమ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. దీంతో నేడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్