నటి కంగనా రనౌత్‌ను కొట్టిన జవాన్‌ బదిలీ

550చూసినవారు
నటి కంగనా రనౌత్‌ను కొట్టిన జవాన్‌ బదిలీ
గత నెలలో ఢిల్లీకి వస్తున్న నటి కంగనా రనౌత్‌ను చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో సీఐఎస్ఎఫ్ జవాన్‌ను విధుల నుంచి తప్పించింది. ఇటీవల ఆమెను కంపెనీ బెంగళూరులోని రిజర్వ్ బెటాలియన్‌కు బదిలీ చేసింది. అయితే ఆమె సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్