తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే (వీడియో)

61చూసినవారు
హీరోయిన్ పూజా హెగ్డే తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. మీడియా తో మాట్లాడుతూ.. 'చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలని కోరిక ఉండేది. శ్రీవారి దర్శనం ఇంత మంచిగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అని అన్నారు. కాగా నిన్న తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని పూజా హెగ్డే దర్శించుకున్నారు. వేద పండితులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్