ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘాల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ నవీన్ డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎంలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. వీరికి సీఐటీయు జిల్లా కార్యదర్ కిరణ్, చిన్నన్న మద్దతు తెలిపారు.