ఆదిలాబాద్ మండల సర్వసభ్య సమావేశం

63చూసినవారు
ఆదిలాబాద్ మండల సర్వసభ్య సమావేశం
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ మండల అభివృద్ధికి పాటు పడాలని ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేష్ సూచించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సభ్యులు స్థానికంగా నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్