పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు

71చూసినవారు
పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు
పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకలను పురస్కరించుకుని ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్