ఆదివాసి ఉద్యమ వీరుడు బిర్సాముండా

54చూసినవారు
హీరాసుఖ ఆదివాసి జాగృతి పర్ధాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివాసి ఉద్యమ వీరుడు బిర్సా ముండా వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆదివాసి హక్కుల కోసం పోరాడిన యోధుడు బిర్సాముండా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నేతలు సిడాం రామ్ కిషన్, మెస్రం కృష్ణ, మాధవ్, జనగం సంతోష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్