బందీలను కాల్చివేయండి: హమాస్‌ హెచ్చరిక

74చూసినవారు
గాజాలో ఉధృతపోరు కొనసాగుతోంది. ఇటీవల హమాస్‌ చెరలో ఉన్న నలుగురు బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ నిర్వహించిన ఆపరేషన్లలో స్థానికంగా భారీగా ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హమాస్‌ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టెల్‌అవీవ్ దళాలు ముందుకు చొచ్చుకొని వస్తున్నాయని భావిస్తే.. బందీలను కాల్చివేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.